బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌ను కోల్పోయిన టీమిండియాకు మరో షాక్ తగిలింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) ప్రకటించిన తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత జట్టు మూడో స్థానానికి పడిపోయింది. టీమిండియా 2016 తర్వాత తొలిసారి మూడో స్థానానికి పడిపోవడం ఇదే తొలిసారి. ఇక పాకిస్తాన్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన దక్షిణాఫ్రికాజట్టు టీమిండియాను వెనక్కినెట్టి రెండో స్థానానికి ఎగబాకింది. భారత్‌తో ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1తో చేజిక్కించుకున్న ఆస్ట్రేలియా అగ్రస్థానంలో నిలువగా.. టాప్-2లో ఉంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్ చేజిక్కించు కున్న ఆస్ట్రేలియా రేటింగ్ పాయింట్లను గణనీయం గా పెంచుకుని అగ్రస్థానాన్ని పటిష్టం చేసుకుంది. తాజా టెస్ట్ట్ ర్యాంకింగ్స్‌లో ఆసీస్ (126పాయింట్లు), దక్షిణాఫ్రికా(112), భారత్(109), ఇంగ్లాండ్(106), న్యూజిలాండ్(96) టాప్-5లో ఉన్నాయి. శ్రీలంక (87), పాకిస్తాన్(83), వెస్టిండీస్(75), బంగ్లాదేశ్ (65), ఐర్లాండ్(26) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
గత 8 టెస్టుల్లో ఒక్కటే విజయం..
టీమిండియా గత ఎనిమిది టెస్టుల్లో ఒక్క టెస్ట్‌లోనే విజయం సాధించింది. ఈ క్రమంలో వరుసగా ఆరు టెస్టుల్లో ఓడి ఒక టెస్ట్‌ను డ్రాగా ముగించింది. దీంతో వరుసగా రెండుసార్లు డబ్ల్యుటిసి ఫైనల్‌కు చేరిన టీమిండియా.. తొలిసారి ఫైనల్‌కు చేరడంలో విఫలమైంది. 2023-25 డబ్ల్యూటిసిలో భారత్ 19మ్యాచ్‌లు ఆడి 9విజ యాలు, 8ఓటములు, 2డ్రాలు నమోదు చేసింది.