రాణించిన తేజల్‌, రావల్‌

Jan 10,2025 23:44 #Cricket, #Sports, #Team India
  • తొలి వన్డేలో ఐర్లాండ్‌ మహిళలపై భారత్‌ ఘన విజయం

రాజ్‌కోట్‌: ఐర్లాండ్‌ మహిళలతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. సౌరాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియంలో శుక్రవారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. టాస్‌ గెలిచిన ఐర్లాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 238పరుగులు చేయగా.. ఆ లక్ష్యాన్ని స్మృతి మంధాన సేన 34.3ఓవర్లలో కేవలం 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 239 పరుగుల లక్ష్యాన్ని.. మరో 15.3 ఓవర్లు మిగిలుండగానే ఛేదించింది. ప్రతీక రావల్‌ (89; 10ఫోర్లు, సిక్సర్‌), తేజల్‌ (53నాటౌట్‌; ఫోర్లు) అర్ధ శతకాలతో చెలరేగారు. కెప్టెన్‌ స్మృతి మంధాన(41) కీలక ఇన్నింగ్స్‌ ఆడింది. హర్లీన్‌ డియోల్‌(20) ఫర్వాలేదనిపించింది. ఐర్లాండ్‌ బౌలర్లలో మాగైర్‌కు మూడు, ఫ్రెయా ఒక వికెట్‌ తీసింది. అంతకుముందు తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. ఓపెనర్‌ గాబీ లూయిస్‌(92), లేV్‌ా పాల్‌(59) అర్ధ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో ప్రియా మిశ్రాకు రెండు, టిటాస్‌ సద్ధు, సయాలి, దీప్తి శర్మ తలో వికెట్‌ తీశారు. రెండో వన్డే ఆదివారం జరగనుండగా.. మూడు వన్డేల సిరీస్‌లో భారత్‌ 1-0 ఆధిక్యతలో నిలిచింది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ ప్రతిక రావల్‌కు దక్కింది.

రికార్డు పుటల్లో మంధాన…

ఐర్లాండ్‌ మహిళలతో జరిగిన తొలి వన్డేలో 41 పరుగులు కొట్టిన టీమిండియా కెప్టెన్‌ స్మృతి మంధాన ఓ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో వేగంగా నాలుగు వేల పరుగుల మార్క్‌ను అందుకున్న భారత క్రీడాకారిణిగా రికార్డుపుటల్లోకెక్కింది. వ్యక్తిగత స్కోరు 41పరుగుల వద్ద ఫ్రేయా సార్జెంట్‌ బౌలింగ్‌లో ఓర్లా ప్రెండర్‌గాస్ట్‌ చేతికి క్యాచ్‌ ఇచ్చి అవుటైంది. ఈ సిరీస్‌కు రెగ్యులర్‌ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ దూరం కాగా.. స్మృతి సారథ్య బాధ్యతలు చేపట్టింది. తొలుత మిథాలీ రాజ్‌(112ఇన్నింగ్స్‌) ఈ ఘనత సాధించగా.. మంధాన(85ఇన్నింగ్స్‌)లోనే ఈ ఫీట్‌ను అందుకుంది.

స్కోర్‌బోర్డు…
ఐర్లాండ్‌ మహిళల ఇన్నింగ్స్‌: ఫోర్బ్స్‌ (సి)దీప్తి (బి)టిటాస్‌ సద్ధు 9, లెవీస్‌ (సి అండ్‌ బి)దీప్తి 92, రేమండ్‌ (రనౌట్‌)రోడ్రిగ్స్‌/రీచా) 5, ప్రెండెగ్రెస్ట్‌ (స్టంప్‌)రీచా (బి)ప్రియా మిశ్రా 9, డెలానీ (బి)ప్రియా మిశ్రా 0, పాల్‌ (రనౌట్‌)హర్లిన్‌/రీచా 59, రెలే (నాటౌట్‌) 15, కెల్టీ (ఎల్‌బి)సయాలీ 28, డెంప్సే (నాటౌట్‌) 6, అదనం 15. (50ఓవర్లలో 7వికెట్ల నష్టానికి) 238పరుగులు. వికెట్ల పతనం: 1/27, 2/34, 3/56, 4/56, 5/173, 6/194, 7/230 బౌలింగ్‌: టిటాస్‌ 9-1-48-1, సయాలి 10-2- 43-1, సైమా 10-0-30-0, ప్రియా మిశ్రా 9-1- 56-2, దీప్తి 10-1-41-1, ప్రతికా 2-0-14-0.

ఇండియా మహిళల ఇన్నింగ్స్‌: స్మృతి మంధాన (సి)ఓర్లా (బి)ఫ్రెయా 41, రావల్‌ (సి)ప్రెంగుర్వా (బి)మాగైర్‌ 89, హర్లిన్‌ డియోల్‌ (సి)ప్రెంగ్యురా (బి)మాగైర్‌ 20, జెమిమా రోడ్రిగ్స్‌ (స్టంప్‌)రిలే (బి)మాగైర్‌ 9, తేజల్‌ (నాటౌట్‌) 53, రీచా (నాటౌట్‌) 8, అదనం 21. (34.3ఓవర్లలో 4వికెట్ల నష్టానికి) 241పరుగులు. బౌలింగ్‌: ఓర్లా 4.4-0-208-0, డెంప్సే 5.3-0- 50-0, కెల్లీ 6-0-29-0, సర్జెంట్‌ 8-0-38-1, మాగైర్‌ 8-1-57-3, లారా 2.2-0-36-0.

➡️