- నేడు ఇంగ్లండ్‌తో చివరి టి20
- రాత్రి 7.00గం||ల నుంచి
ముంబయి: టి20 సిరీస్‌ను చేజిక్కించుకున్న టీమిండియా.. మరో విజయంపై కన్నేసింది. వాంఖడే స్టేడియంలో ఇంగ్లండ్‌తో ఆదివారం జరిగే ఐదో, చివరి టి20లో టీమిండియా గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. నాల్గో టి20లో గాయపడ్డ శివమ్ దూబే ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేనట్లే. దీంతో అతని స్థానంలో మహ్మద్ షమీ బరిలోకి దిగనున్నట్లు బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్నెల్ వెల్లడించాడు. ఐదు టి20ల సిరీస్‌లో 3-1 ఆధిక్యతలో ఉన్న టీమిండియా.. ఈ సిరీస్ ముగిసిన అనంతరం మూడు వన్డేల సిరీస్‌కు సిద్ధం కానుంది.
జట్లు(అంచనా):
భారత్: సూర్యకుమార్(కెప్టెన్), సంజు(వికెట్ కీపర్), అభిషేక్, తిలక్ వర్మ, హార్దిక్, అక్షర్, సుందర్, షమీ/జురెల్ ఆర్ష్‌దీప్, బిష్ణోరు, వరుణ్ చక్రవర్తి.
ఇంగ్లండ్: బట్లర్(కెప్టెన్), డకెట్, సాల్ట్(వికెట్ కీపర్), బ్రూక్, లివింగ్‌స్టోన్, స్మిత్, ఓవర్టన్, కర్సే, ఆర్చర్, రషీద్, వుడ్.