Thailand open 2024: మెయిన్‌ డ్రాకు మస్మన్‌ అర్హత

May 14,2024 23:01 #Badminton, #Sports

బ్యాంకాక్‌: థాయ్ లాండ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ మెయిన్‌ డ్రాకు మస్మన్‌ అర్హత సాధించాడు. మంగళవారం జరిగిన క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో మస్మన్‌ 21-19, 21-9తో హాంకాంగ్‌కు చెందిన కె.జె.హాంగ్‌ను చిత్తుచేశాడు. అంతకుముందు తొలిరౌండ్‌లో మస్మన్‌ 15-21, 21-14, 21-16తో భారత్‌కే చెందిన దలాల్‌ను ఓడించాడు. తొలిరౌండ్‌లో మస్మన్‌ భారత్‌కే చెందిన స్టార్‌ షట్లర్‌ హెచ్‌ఎస్‌ ప్రణరుతో తలపడనున్నాడు. బుధవారం జరిగే ఇతర తొలిరౌండ్‌ పోటీల్లో ఎస్‌కె. కరుణాకరన్‌ సింగపూర్‌కు చెందిన జాసన్‌తో, కిరణ్‌ జార్జి.. డెన్మార్క్‌కు చెందిన క్రిస్టోఫర్‌ సేన్‌తో తలపడనున్నారు. ఇక మహిళల సింగిల్స్‌లో మాల్విక బన్సోద్‌ చైనా షట్లర్‌ వై. హాన్‌తో, ఆకర్షీ కశ్యప్‌.. థారులాండ్‌కు చెందిన ఒంగ్బమ్రుంగ్సాన్‌తో తలపడనున్నారు. ఇతర పోటీల్లో ఫరూఖీ చైనా షట్లర్‌ జియోతో, హుడా.. జర్మనీకి చెందిన టాన్‌తో అమీతుమీ తేల్చుకోనున్నారు.

➡️