పూణే: ప్రొ కబడ్డీ సీజన్-11లో తమిళ్ తలైవాస్, హర్యానా స్టీలర్ మరో విజయాన్ని సొంతం చేసుకున్నాయి. శుక్రవారం ఏకపక్షంగా సాగిన పోటీలో తమిళ్ జట్టు 40-27పాయింట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌ను చిత్తుచేయగా.. మరో గేమ్‌లో హర్యానా జట్టు 46-36పాయింట్ల తేడాతో పట్నా పైరెట్స్‌ను ఓడించింది. తమిళ్ జట్టులో మోయిన్(13) రైడ్స్‌లో రాణించగా.. సౌరభ్(7), ట్యాకిల్స్‌లో మెరిసారు. ఇక గుజరాత్ జట్టులో హిమాన్షు(11) రైడ్స్‌లో ఒంటరి పోరాటం చేయగా.. ట్యాకిల్స్‌లో నిరాశపరిచారు. మొత్తమ్మీద తమిళ్ జట్టు నాలుగుసార్లు గుజరాత్‌ను, గుజరాత్ జట్టు రెండుసార్లు తమిళ్ జట్టును ఆలౌట్ చేశాయి. తమిళ్ జట్టు 23పాయింట్లను రైడ్‌ల ద్వారా 13పాయింట్లను ట్యాకిల్స్ ద్వారా సాధించింది. దీంతో 15మ్యాచ్‌లు ముగిసేసరికి తమిళ్ జట్టు 33పాయింట్లతో 9వ, గుజరాత్ జట్టు 29పాయింట్లతో 11వ స్థానంలో ఉన్నాయి. ఇక హర్యానా జట్టులో శివమ్ పట్వారి(11) రైడ్ పాయింట్లకు తోడు మహ్మద్రేజ(9) ఆల్‌రౌండ్ ప్రతిభ కనబరిచాడు.