సిరీస్‌పై అమ్మాయిలు గురి

  • నేడు ఐర్లాండ్‌తో రెండో వన్డే
  • ఉదయం 11.00గం||ల నుంచి

రాజ్‌కోట్‌: ఐర్లాండ్‌ మహిళలలో జరిగిన తొలి వన్డేలో ఘన విజయం సాధించిన టీమిండియా.. ఇక సిరీస్‌పై గురిపెట్టింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో నెగ్గి 1-0 ఆధిక్యతలో ఉన్న మంధాన సేన.. ఈ వన్డేలోనూ గెలిస్తే మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను చేజిక్కించుకోనుంది. శుక్రవారం జరిగిన వన్డేలో ఓపెనర్‌ ప్రతిక రావల్‌(89), తేజల్‌(53) అర్ధసెంచరీలతో రాణించడంతో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రెగ్యులర్‌ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ గైర్హాజరీలో ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌కు స్మృతి మంధాన నాయకత్వ పగ్గాలు అందుకుంది.

జట్లు(అంచనా)…
ఇండియా: మంధాన(కెప్టెన్‌), రావల్‌, హర్లిన్‌, రోడ్రిగ్స్‌, తేజల్‌, రీచా ఘోష్‌(వికెట్‌ కీపర్‌), దీప్తి శర్మ, సాయల్‌, సైమా ఠాకూర్‌, ప్రియా మిశ్రా, టిటాస్‌ సద్ధు

ఐర్లాండ్‌: ఫోర్బెస్‌, లెవీస్‌(కెప్టెన్‌), రేమండ్‌, ప్రెడెంగెస్ట్‌, డెలానీ, పాల్‌, రీలె(వికెట్‌ కీపర్‌), అరైనా కెల్లీ, డెంసే, ఫ్రెయా సర్గెట్‌, అమీ మగ్యూర్‌.

➡️