ఛాంపియన్స్‌ ట్రోఫీ తర్వాత క్రికెట్‌కు గుడ్‌బై: మహ్మద్‌ నబీ

అఫ్గనిస్తాన్‌ లెజెండరీ ఆల్‌రౌండర్‌ మహమ్మద్‌ నబీ సదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలుకబోతున్నాడు. అఫ్గన్‌ జట్టులో కీలక ఆటగాడైన నబీ వన్డేలకు త్వరలోనే రిటైర్మెంట్‌ ప్రకటించనున్నాడు. వచ్చే ఏడాది పాకిస్తాన్‌ వేదికగా జరిగే చాంపియన్స్‌ ట్రోఫీ అనంతరం వన్డే ఫార్మాట్‌ నుంచి వైదొలగుతాడని అఫ్గనిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు చైర్మన్‌ నసీబ్‌ ఖాన్‌ శుక్రవారం వెల్లడించాడు. అతడి నిర్ణయాన్ని బోర్డు సభ్యులు కూడా స్వాగతించారు. ఇకపై నబీ టి20, ఫ్రాంచైజీ క్రికెట్‌ మీద దృష్టి సారించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు నసీబ్‌ వెల్లడించాడు. స్పిన్‌ ఆల్‌రౌండర్‌ అయిన నబీ 2009లో వన్డే అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకూ 165 మ్యాచ్‌లు ఆడిన నబీ 3,549 పరుగులు సాధించడమే కాకుండా… 27.30 సగటుతో 171 వికెట్లు పడగొట్టాడు.

➡️