అల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీ
లండన్: ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీ క్వార్టర్‌ఫైనల్లోకి లక్ష్యసేన్ దూసుకెళ్లారు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రి క్వార్టర్‌ఫైనల్లో లక్ష్యసేన్ 21-13, 21-10తో వరుససెట్లలో జొనాథన్ క్రిస్టీ(ఇండోనేషియా)ను చిత్తుచేశాడు. ఇక మహిళల సింగిల్స్‌లో భారత షట్లర్ల పోరాటం ముగిసింది. ప్రి క్వార్టర్స్‌కు చేరిన మాల్విక టాప్‌సీడ్, జపాన్‌కు చెందిన యమగుచి చేతిలో వరుససెట్లలో ఓటమిపాలైంది. యమగుచి 21-16, 21-13తో మల్వికను చిత్తుచేసి క్వార్టర్స్‌కు చేరింది. ఇక పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జంట ప్రి క్వార్టర్స్‌కు చేరింది. ప్రి క్వార్టర్స్‌లో ఈ జోడీ గాయపడి టోర్నీనుంచి వైదొలిగింది.
