Kanpur Test: వాన దెబ్బకు మూడో రోజు ఆట కూడా రద్దు

Sep 29,2024 18:12 #2nd Test, #Bangladesh, #Rain, #Team India

టీమిండియా, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య కాన్పూర్‌లో జరుగుతున్న రెండో టెస్టుకు వరుణుడు అడ్డంకిగా మారాడు. తొలి రోజు ఆట నుంచే ప్రభావం చూపిస్తున్న వర్షం… నిన్న రెండో రోజు ఆటను పూర్తిగా తుడిచిపెట్టేసింది. గ్రీన్‌ పార్క్‌ స్టేడియం వర్షంతో తడిసి ముద్దవడంతో మూడో రోజు కూడా ఒక్క బంతి పడకుండానే ఆట రద్దయింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. బంగ్లాదేశ్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లకు 107 పరుగులతో ఆడుతున్నప్పుడు నిలిచిపోయిన ఆట మూడు రోజులైన మళ్లీ మొదలుకాలేదు.

➡️