Squash Championship: విజేతలు జ్యోత్న-అభయ్

May 16,2024 21:03 #Sports, #Squash Championship

చెన్నై: హెచ్‌సిఎల్‌ జాతీయ స్క్వాష్‌ ఛాంపియన్‌షిప్‌ మిక్స్‌డ్‌ టైటిల్‌ను జ్యోత్న చిన్నప్ప-అభయ్ సింగ్‌ చేజిక్కించుకున్నారు. ఇండియన్‌ స్క్వాష్‌ ట్రియాథాన్‌ అకాడమీలో బుధవారం రాత్రి జరిగిన ఫైనల్లో జ్యోత్న-అభయ్ 10-11, 11-2, 11-9తో రాధిక-హరిందర్‌ పాల్‌లను ఓడించారు. ఈ మ్యాచ్‌ సుమారు 45 నిమిషాలసేపు సాగింది. తొలి గేమ్‌లో 3-5పాయింట్లతో వెనుకబడ్డా.. ఆ తర్వాత పుంజుకొని స్కోర్‌ను 5-5పాయింట్లతో సమం చేశారు. ఆ తర్వాత వరుసగా పాయింట్లు సాధించినా చివర్లో ఒక పాయింట్‌ చేజార్చుకోవడంతో ఆ గేమ్‌ను కోల్పోయారు. ఇక రెండో గేమ్‌లో జ్యోత్న-అభయ్ రాణించడంతో ఏకపక్షమైంది. దీంతో ఆ గేమ్‌ను 11-2తో సునాయాసంగా చేజిక్కించుకున్నారు. ఇక మూడో గేమ్‌ పోరాపోటీగా సాగింది. ఓ దశలో 6-6పాయింట్లతో సమంగా ఉండగా.. ఆ తర్వాత జ్యోత్న-అభరు వరుసగా రెండు పాయింట్లు 8-6కు దూసుకెళ్లారు. చివరివరకు ఆ పాయింట్ల ఆధిక్యతను నిలబెట్టుకుంటూ మ్యాచ్‌ను ముగించారు.

➡️