- లీగ్ దశలోనే నిష్క్రమించిన వారియర్స్, బెంగళూరు
లక్నో: డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)ని యుపి జట్టు చేత్తు చేసినా.. లీగ్ దశలోను దాటలేకపోయింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే బెంగళూరు, యుపి జట్లు ప్లే-ఆఫ్ రేసునుంచి నిష్క్రమిం చగా.. ముంబయి, గుజరాత్ జట్లు ప్లే-ఆఫ్స్ బెర్త్‌లను ఖాయం చేసుకున్నాయి. బెంగళూరుతో శనివారం జరిగిన మ్యాచ్‌లో భారీ తేడాతో నెగ్గాల్సిన యుపి జట్టు కేవలం 12పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన యుపి మహిళలు నిర్ణీత 20 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 225 పరుగుల భారీస్కోర్ నమోదు చేయగా.. అనంతరం బెంగళూరు జట్టు 19.3 ఓవర్లలో 213పరుగులకే ఆలౌటైంది. తొలుత యుపి ఓపెనర్లు హార్రీస్, జార్జియా వాల్ కలిసి తొలి వికెట్‌కు 77పరుగులు జతచేశారు. ఆ తర్వాత హార్రీ(39) ఔటైనా.. జార్జియా ధనా ధన్ ఇన్నింగ్స్‌తో మెరిసింది. కేవలం 56బంతుల్లోనే 17ఫోర్లు, ఒక సిక్సర్‌తో 99పరుగులు చేసింది. మరోవైపు నవ్‌గైర్(46), హెన్రీ(19), ఎక్లేస్టోన్(13) ధాటిగా ఆడారు. దీంతో యుపి జట్టు నిర్ణీయాత్మక మ్యాచ్‌లో భారీస్కోర్ నమోదు చేసింది. బెంగళూరు బౌలర్లలో వారేహామ్‌కు రెండు, ఛార్లీ డీన్‌కు ఒక వికెట్ దక్కాయి. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బెంగళూరు జట్టు చివర్లో స్నేV్‌ా రాణా(26; 6బంతుల్లో 2ఫోర్లు, 3సిక్సర్లు) ధనా ధన్ బ్యాటింగ్ తో రాణించి విజయంపై ఆశలు రేపినా.. కీలక సమయంలో ఔటవ్వడంతో బెంగళూరు విజయావకాశాలు నీరుగారాయి. యుపి బౌలర్లలో ఎక్లేస్టోన్, దీప్తి శర్మకు మూడేసి, హెన్రీకి రెండు వికెట్లు దక్కాయి.
స్కోర్‌బోర్డు…
యుపి వారియర్స్ మహిళల ఇన్నింగ్స్: గ్రేస్ హార్రీస్ (రనౌట్) మంధాన/వారేహామ్ 39, జార్జియా వాల్ (నాటౌట్) 99, నవ్‌గైర్ (సి)పెర్రీ (బి)వారేహామ్ 46, హెన్రీ (సి)మంధాన (బి)వారేహామ్ 19, ఎక్లేస్టోన్ (బి)ఛార్లీ డీన్ 13, దీప్తి శర్మ (రనౌట్) పెర్రీ/రీచా 1, అదనం 8. (20 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి) 225పరుగులు.
వికెట్ల పతనం: 1/77, 2/148, 3/191, 4/223, 5/225
బౌలింగ్: కిమ్ గార్త్ 4-0-42-0, రేణుకా సింగ్ 3-0-32-0, ఛార్లొటే డీన్ 4-0-47-1, ఎలైసె పెర్రీ 4-0-35-0, వారేహామ్ 4-0-43-2, స్నేV్‌ా రాణా 1-0-13-0.