చివరి లీగ్‌లో త్రీసా-గాయత్రి ఓటమి

Dec 14,2024 00:01 #Badminton

బిడబ్ల్యుఎఫ్‌ ఫైనల్స్‌
హాంగ్జౌ: బిడబ్ల్యుఎఫ్‌ ఫైనల్స్‌ మహిళల డబుల్స్‌ చివరి రౌండ్‌లో భారత జంటకు నిరాశ తప్పలేదు. తొలి లీగ్‌లో ఓడిన భారతజంట.. రెండో లీగ్‌లో గెలిచి సెమీస్‌ రేసులో నిలిచినా.. శుక్రవారం జరిగిన నిర్ణయాత్మక మూడో, చివరి లీగ్‌ గేమ్‌లో వరుససెట్లలో ఓటమిపాలయ్యారు. 8వ సీడ్‌గా ఈ టోర్నీకి అర్హత సాధించిన త్రీసా-గాయత్రి జంట 17-21, 13-21తో జపాన్‌కు చెందిన సుయామా-షిడా పరాజయాన్ని చవిచూశారు. తొలి రెండో లీగ్‌ పోటీల్లో అద్భుత ప్రదర్శనను కనబర్చిన భారత జంట.. నిర్ణయాత్మక గేమ్‌లో ఆ స్థాయి ప్రదర్శనను కనబర్చలేకపోయారు. ఈ మ్యాచ్‌ కేవలం 49నిమిషాల్లోనే ముగిసింది.

➡️