నేడు భారత్ × శ్రీలంక మహిళల మధ్య ముక్కోణపు సిరీస్ ఫైనల్
ఉదయం 10.00గం||ల నుంచి
కొలంబో: ముక్కోణపు సిరీస్ ఫైనల్లో భారత మహిళలజట్టు ఆతిథ్య శ్రీలంకతో టైటిల్‌కై తలపడనుంది. లీగ్‌లో ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడు మ్యాచుల్లో నెగ్గి టాప్‌లో ఉన్న భారతజట్టు ఈ లీగ్‌లో శ్రీలంక చేతిలో ఒక మ్యాచ్‌లో ఓటమి పాలైంది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా మహిళలపై పోరాడి నెగ్గి ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది. మరోవైపు ఆతిథ్య శ్రీలంక జట్టు భారత్‌తో ఒక మ్యాచ్‌లో, దక్షిణాఫ్రికాతో మరో మ్యాచ్‌లో ఓటమిపాలైంది. అయినా 4పాయింట్లతో 2వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు చేరింది. ఈ క్రమంలో భారత్-శ్రీలంక జట్ల మధ్య ప్రేమదాస స్టేడియంలో ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా సాగనుంది. ఇక భారతజట్టు విష యానికొస్తే.. టాపార్డర్, మిడిలార్డర్ బ్యాటర్లు సమిష్టిగా రాణిస్తుండడం, బౌలర్లు చెలరేగు తుండడంతో టీమిండియాకు సానుకూ లాంశం. అయితే.. చమరి ఆటపట్టు బృందాన్ని తక్కువ అంచనా వేయడానికి లేదు. లీగ్ దశలో ఇరుజట్లు చెరొక మ్యాచ్ గెలుపొందాయి. టి20 వరల్డ్ కప్‌లో నిరాశపర్చిన భారత జట్టు పుంజుకుంది. ముక్కోణపు సిరీస్‌లో సమిష్టిగా రాణిస్తూ శ్రీలంక, దక్షిణాఫ్రికాలకు చెక్ పెట్టింది. ఆరంభ పోరులో ఓపెనర్లు ప్రతీకా రావల్ అర్ధ శతకంతో రాణించడంతో లంకపై 9 వికెట్ల తేడాతో గెలుపొందింది హర్మన్‌ప్రీత్ సేన ఆ తర్వాత సఫారీలను 15 పరుగుల తేడాతో ఓడించినా.. తదుపరి పోరులో శ్రీలంక చేతిలో 3 వికెట్లతో ఓటమి పాలైంది. ఆ తర్వాత దక్షిణాఫ్రికాను ఓడించిన ఇండియా.. ఫైనల్‌కు దూసుకెళ్లింది. నిరుడు ఆసియా కప్ ఫైనల్లో భారత జట్టు అనూహ్యంగా శ్రీలంక చేతిలో ఓటమిపాలైంది. దీంతో శ్రీలంక జట్టును చిత్తుచేసి టైటిల్‌ను చేజిక్కించుకోవడానికి హర్మన్‌ప్రీత్ సేనకు ఇదే సదవకాశం.
జట్లు(అంచనా)…
భారత్: హర్మన్‌ప్రీత్(కెప్టెన్), ప్రతికా రావల్, మంధాన, హర్లిన్, రోడ్రిగ్స్, దీప్తి, రీచా(వికెట్ కీపర్), శ్రీచరాణి, స్నేV్‌ా రాణా, కశ్వీ, అరుంధతి.
శ్రీలంక: ఛమారి ఆటపట్టు(కెప్టెన్), హాసిని పెరీరా, విష్మీ గుణరత్నే, హర్షిత, నీలాక్షి-డి-శిల్వ, ననయకర్రా, అనుష్క, విహాంగ, సుగంధిక, మైకి మధారా, ప్రియదర్శిని.