2025 ఆస్ట్రేలియన్ క్రికెట్ అవార్డ్స్ విజేతల వివరాలను క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ట్రవిస్ హెడ్, జోష్ హాజిల్‌వుడ్, ఆడమ్ జంపా, అన్నాబెల్ సదర్‌ల్యాండ్, ఆష్లే గార్డ్‌నర్, బెత్ మూనీ వివిధ ఫార్మాట్లకు సంబంధించిన అవార్డులు గెలుచుకున్నారు. విధ్వంసకర బ్యాటర్ ట్రవిస్ హెడ్ తొలిసారి అలెన్ బోర్డర్ మెడల్‌ను గెలుచుకున్నాడు. ఈ మెడల్ కోసం జోష్ హాజిల్‌వుడ్, పాట్ కమిన్స్ హెడ్‌తో పోటీపడ్డారు. ఆల్‌రౌండర్లు గ్లెన్ మ్యాక్స్‌వెల్, కూపర్ కన్నోలీ జాయింట్‌గా మెన్స్ బిగ్‌బాష్ లీగ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు గెలుచుకున్నారు. ఎల్లిస్ పెర్రీ, జెస్ జొన్నాసెన్ జాయింట్‌గా మహిళల బిగ్‌బాష్ లీగ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు గెలుచుకున్నారు.
