నేడు టీమిండియా, న్యూజిలాండ్‌ మధ్య రెండో వన్డే

అహ్మదాబాద్‌ : టీమిండియా మహిళల జట్టు-న్యూజిలాండ్‌ మహిళల జట్ల మధ్య నేడు (ఆదివారం) మరో మ్యాచ్‌ జరగనుంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జరగనున్న రెండోవ వన్డే మ్యాచ్‌లో ఈ జట్లు తలపడనున్నాయి. అహ్మదాబాద్‌ వేదికగా మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభమవుతుంది. ఇప్పటికే తొలి వన్డే గెలిచిన భారత్‌ ఈ మ్యాచ్‌ గెలిచి సిరీస్‌ కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఇందులో ఎలాగైనా గెలిచి రేసులో నిలవాలని కివీస్‌ భావిస్తోంది. స్పోర్ట్స్‌18, జియో సినిమాలో ప్రసారం కానుంది.

జట్లు
భారత మహిళా జట్టు: షఫాలీ వర్మ, స్మతి మంధాన, యస్తికా భాటియా, దయాళన్‌ హేమలత, జెమీమా రోడ్రిగ్స్‌, తేజల్‌ హసబ్నిస్‌, దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, రాధా యాదవ్‌, సైమా ఠాకూర్‌, రేణుకా ఠాకూర్‌ సింగ్‌, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, పటిల్‌ ఉమా చెత్రీ, సయాలీ సత్‌ఘరే, ప్రియా మిశ్రా

న్యూజిలాండ్‌ మహిళా జట్టు: సుజీ బేట్స్‌, జార్జియా ప్లిమ్మర్‌, లారెన్‌ డౌన్‌, సోఫీ డివైన్‌, బ్రూక్‌ హాలిడే, మాడీ గ్రీన్‌, ఇసాబెల్లా గాజ్‌, జెస్‌ కెర్‌, మోలీ పెన్‌ఫోల్డ్‌, ఈడెన్‌ కార్సన్‌, లీ తహుహు, హన్నా రోవ్‌, ఫ్రాన్‌ జోనాస్‌, పాలీ ఇంగ్లీస్‌

➡️