మణిపూర్‌కు అగ్రస్థానం

Feb 1,2025 07:37 #Manipur, #National sports

కబడ్డీలో రాజస్థాన్‌, యుపి ఘన విజయం
38వ జాతీయ క్రీడలు
డెహ్రాడూన్‌: 38వ జాతీయ క్రీడల్లో పతకాల పట్టికలో మణిపూర్‌ జట్టు అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. ఇక కబడ్డీ పోటీల్లో రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌ జట్లు ఘన విజయం సాధించాయి. తొలి మ్యాచ్‌లో గ్రూప్‌-ఎలో రాజస్థాన్‌ జట్టు 48-35పాయింట్ల తేడాతో ఉత్తరాఖండ్‌ను చిత్తుచేయగా.. గ్రూప్‌-బిలో ఉత్తరప్రదేశ్‌ జట్టు 62-29పాయింట్ల తేడాతో కర్ణాటకను చిత్తుచేసింది. గ్రూప్‌-ఎ మరో మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ సర్వీసెస్‌ 41-36పాయింట్ల తేడాతో హర్యానాను, గ్రూప్‌-బిలో ఛత్తీస్‌గడ్‌ జట్టు 62-50పాయింట్లతో మహారాష్ట్రను ఓడించాయి.

➡️