విండీస్‌ క్రికెట్‌లో విషాదం.. ఇద్దరు దిగ్గజ క్రికెటర్లు కన్నుమూత

Dec 9,2023 12:42 #Cricket, #Sports, #West Indies

వెస్టిండీస్‌ క్రికెట్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒకే రోజు ఇద్దరు దిగ్గజ క్రికెటర్లు మృతి చెందారు. శుక్రవారం(డిసెంబర్‌ 8) వెస్టిండీస్‌ మాజీ ఆఫ్‌ స్పిన్నర్‌ క్లైడ్‌ బట్స్‌(66) రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా.. మరోకరు జో సోలమన్‌(93) అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఈ విషయాన్ని క్రికెట్‌ వెస్టిండీస్‌ ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. ఈ ఇద్దరి దిగ్గజ క్రికెటర్ల మృతి పట్ల వెస్టిండీస్‌ క్రికెట్‌ సంతాపం వ్యక్తం చేసింది. వారి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ విండీస్‌ క్రికెట్‌ ట్విట్‌ చేసింది.

జో సోలమన్‌ : 1958 నుంచి 1965 మధ్య విండీస్‌ తరపున 27 టెస్టులు ఆడిన సోలమన్‌.. 34 సగటుతో 1326 పరుగులు సాధించాడు.

క్లైడ్‌ బట్స్‌ :1980లో వెస్టిండీస్‌ తరుపున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన క్లైడ్‌ బట్స్‌ తన స్పిన్‌ బౌలింగ్‌తో అందరని అకట్టుకున్నాడు. జాతీయ జట్టు తరపున కేవలం 7 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన.. దేశవాళీ క్రికెట్‌లో మాత్రం బట్స్‌కు అద్భుతమైన రికార్డు ఉంది. 87 ఫస్ట్‌క్లాస్‌, 32 లిస్ట్‌-ఏ మ్యాచ్‌ల్లో గయానాకు బట్‌ ప్రాతినిథ్యం వహించాడు. క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత ఆయన కామేంటేటర్‌గా, 2000లో విండీస్‌ క్రికెట్‌ సెలక్షన్‌ కమిటీ చైర్మెన్‌గా పనిచేశారు.

➡️