U-19: విశ్వ విజేత భారత్‌

  • ఫైనల్లోనూ త్రిషా ఆల్‌రౌండ్‌ షో
  • దక్షిణాఫ్రికాపై 9వికెట్ల తేడాతో టీమిండియా గెలుపు
  • ఐసిసి అండర్‌-19 మహిళల విజేత భారత్‌

కౌలాలంపూర్‌: ఐసిసి అండర్‌-19 మహిళల టి20 ప్రపంచకప్‌లో భారత్‌ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో వరుసగా రెండోసారి అండర్‌ 19 వరల్డ్‌ కప్‌లో టీమిండియా గెలుపొందింది. ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్‌?లో భారత్‌ 9 వికెట్ల తేడాతో విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచింది. సఫారీ జట్టు నిర్దేశించిన 83 పరుగుల లక్ష్యాన్ని, టీమిండియా అమ్మాయిలు 11.2 ఓవర్లలో 1 వికెట్‌? కోల్పోయి ఛేదించారు. గొంగడి త్రిష 33 బంతుల్లో 44 పరుగులు (8ఐ4) చేసి నాటౌట్‌గా నిలిచింది. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 82 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్ల విజంభనతో సఫారీ జట్టు విలవిల్లాడింది. మికీ వాన్‌ (23 పరుగులు)టాప్‌ స్కోరర్‌.. నలుగురు ప్లేయర్లు పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌ చేరారు. భారత జట్టు బౌలర్లలో త్రిష 3, పరునిక, ఆయూషి, వైష్ణవి తలో 2, షబ్నమ్‌ 1 వికెట్‌ తీశారు. ఈ టోర్నీలో తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష అద్భుతంగా రాణించింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో దుమ్మురేపింది. ఈ టోర్నీలో సెంచరీ బాదేసింది. ఫైనల్‌?లోనూ మూడు వికెట్లతో రాణించి, విజయానికి కారణమై అందరి దష్టిని ఆకర్షించింది. ఇక ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌గా, ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా గొంగడి త్రిష నిలిచింది.

The India Under-19 girls celebrate their title win, India vs South Africa, Under-19 Women's T20 World Cup final, Kuala Lumpur, February 2, 2025

ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌ త్రిషకే

తెలుగమ్మాయి గొంగడి త్రిష ఐసిసి అండర్‌-19 మహిళల టి20 వరల్డ్‌ కప్‌లో అద్భుతంగా రాణించింది. టీమిండియా టైటిల్‌ విన్నర్‌గా నిలవడంలో త్రిష కీలకపాత్ర పోషించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో త్రిష 4ఓవర్లలో 15 పరుగులిచ్చి 3 వికెట్లు తీయడమే కాకుండా… బ్యాటింగ్‌లోనూ రాణించి 33బంతుల్లో అజేయంగా 44 పరుగులు చేసింది. ఆల్‌ రౌండ్‌ నైపుణ్యం ఆమెకు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డునే కాదు… ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌ అవార్డును కూడా వరించింది. ఈ వరల్డ్‌ కప్‌లో త్రిష మొత్తం 309 పరుగులు చేసింది. బౌలింగ్‌లో 7 వికెట్లు తీసి సత్తా చాటింది. అంతేకాదు, ఈ టోర్నమెంట్‌ లో నమోదైన ఏకైక సెంచరీ సాధించింది కూడా మన త్రిషనే. టైటిల్‌ విజేతగా నిలిచిన అనంతరం భారత మహిళల జట్టు మాజీ క్రికెటర్‌ నీతూ డేవిడ్‌ చేతుల మీదుగా త్రిష ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌ అవార్డు అందుకుంది. ఈ అవార్డును తన తండ్రికి అంకితం ఇస్తున్నానని ప్రకటించింది. త్రిష స్వస్థలం తెలం గాణలోని భద్రాచలం. 9ఏళ్ల వయసుకే హైదరా బాద్‌ అండర్‌-16 జట్టుకు ఎంపికై సత్తా చాటింది. ఆ తర్వాత అండర్‌-23 కేటగిరీలోనూ ఆడింది.

స్కోర్‌బోర్డు..
దక్షిణాఫ్రికా అండర్‌-19 మహిళల ఇన్నింగ్స్‌: బోథా (సి)కమిలిని (బి)షబ్నమ్‌ 16, లారెన్స్‌ (బి)సిసోడియా 0, రామ్‌లకన్‌ (బి)ఆయుషీ శుక్లా 3, రెనెకె (సి)సిసోడియా (బి)త్రిషా 7, మెసో (బి)ఆయుషీ శుక్లా 10, వాన్‌-వుర్ట్స్‌ (స్టంప్‌)కమిలిని (బి)త్రీషా 23, కోలింగ్‌ (బి)వైష్ణవి శర్మ 15, శేష్ణు నాయుడు (బి)త్రీషా 0, వాన్‌-వైర్క్‌ (సి)వైష్ణవి (బి)సిసోడియా 0, లెగోడి (బి)వైష్ణవి శర్మ 0, నిని (నాటౌట్‌) 2, అదనం 6. (20ఓవర్లలో ఆలౌట్‌) 82పరుగులు.

వికెట్ల పతనం: 1/11, 2/20, 3/20, 4/40, 5/44, 6/74, 7/74. 8/74, 9/80, 10/82

బౌలింగ్‌: జోషితా 2-0-17-0, సిసోడియా 4-0-6-2, షబ్నమ్‌ 2-0-7-1, ఆయుషీ శుక్లా 4-2-9-2, వైష్ణవి శర్మ 4-0-23-2, త్రీషా 4-0-15-3,

భారత అండర్‌-19 మహిళల ఇన్నింగ్స్‌: కమిలిని (సి)లారెన్స్‌ (బి)రెనెకె 8, గొంగడి త్రీషా (నాటౌట్‌) 44, సనికా ఛల్కే (నాటౌట్‌) 26, అదనం 6. (11.2ఓవర్లలో ఒక వికెట్‌ నష్టానికి) 84పరుగులు.

వికెట్ల పతనం: 1/36

బౌలింగ్‌: నిథాబి 1-0-7-0, కాలింగ్‌ 2-0-19-0, రెనెకె 4-1-14-1, శేష్ని 1-0-12-0, వైర్క్‌ 1-0- 12-0, లెగోడి 1.2-0-10-0, బోథా 1-0-9-0.

➡️