Under-19 Asia Cup: టీమిండియా ఓటమి

దుబాయ్ : అండర్‌-19 ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 43 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 282 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత్‌ 238 పరుగులకు ఆలౌటైంది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌… నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. ఓపెనర్‌ షాజైబ్‌ ఖాన్‌ 150 పరుగులు, మరో ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖాన్‌ 60 పరుగులు చేసి పాకిస్తాన్‌ విజయంలో కీలకపాత్ర పోషించారు. ఛేదనకు దిగిన భారత్‌ బ్యాటర్లు ఏ దశలోనూ పెద్ద భాగస్వామ్యాలు నెలకొల్పలేదు. మిడిలార్డర్‌ బ్యాటర్‌ నిఖిల్‌ కుమార్‌ 67 పరుగులు చేశాడు. టెయిలెండర్లు యుదాజిత్‌ గుహ 12 పరుగులు, మహ్మద్‌ ఈనాన్‌ 30 పరుగులు చేసి పదో వికెట్‌కు 47 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి, భారత్‌ ఓటమి అంతరాన్ని తగ్గించారు.

➡️