వినేశ్‌ అప్పీల్‌పై తీర్పు నేటికి వాయిదా

రెజ్లింగ్‌ వినేశ్‌ ఫోగాట్‌ తీర్పును ‘కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌’ వాయిదా వేసింది. తొలుత శనివారం(10న) తీర్పును వెలువరిస్తామని ప్రకటించిన కోర్టు చివరి క్షణంలో వాయిదా వేసింది. ఒలింపిక్స్‌ ముగిసేలోపు వినేశ్‌పై తీర్పును వెలువరిస్తామని కోర్టు పేర్కొన్న సంగతి తెలిసిందే. వినేశ్‌ ఫొగాట్‌ చేసిన అభ్యర్థనను కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ స్వీకరించింది. 100 గ్రాములు అదనపు బరువు కారణంగా పతకం కోల్పోయిన వినేశ్‌ ఫొగాట్‌.. తనకు రజత పతకం ఇవ్వాలని అప్పీలులో కోరారు. ఒకవేళ తీర్పు వినేశ్‌కు అనుకూలంగా వస్తే.. ఐఒసి ఆమెకు సంయుక్తంగా రజత పతకం ఇవ్వాల్సి వుంటుంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే వినేశ్‌ రెజ్లింగ్‌కు రిటైర్‌మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

➡️