Video – కరుణ్‌-బుమ్రా మధ్య గొడవ.. రోహిత్‌ ఫన్నీ రియాక్షన్‌

ఐపిఎల్‌ 2025 సీజన్‌ లో భాగంగా … ఢిల్లీ క్యాటిటల్స్‌ వర్సెస్‌ ముంబై ఇండియన్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ మధ్యలో … ముంబై ఇండియనస్‌ స్టార్‌ పేసర్‌ జస్‌ ప్రీత్‌ బుమ్రా, ఢిల్లీ క్యాపిటల్స్‌ బ్యాటర్‌ కరుణ్‌ నాయర్‌ ఇద్దరూ గొడవపడ్డారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇంపాక్ట్‌ ప్లేయర్‌ గా బరిలోకి దిగిన కరుణ్‌ నాయర్‌ అద్భుతమైన బ్యాటింగ్‌ తో చెలరేగాడు. ఔటాఫ్‌ సిలబస్‌ గా బరిలోకి దిగి ముంబై ఇండియన్స్‌ బౌలర్లను చితక్కొట్టాడు. వరల్డ్‌ బేస్డ్‌ పేసర్‌ అయిన జస్ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌ లోనూ అలవోకగా సిక్సర్లు బాదాడు. బుమ్రా వేసిన 4వ ఓవర్‌ లో రెండు బౌండరీలతో 11 పరుగులు చేశాడు కరుణ్‌ నాయర్‌.. బుమ్రా వేసిన 6వ ఓవర్‌ లో రెండు సిక్సులు, రెండు ఫోర్లతో 18 పరుగులు చేసి 22 బంతుల్లో హాఫ్‌ సెంచరీ సాధించాడు. 7 ఏళ్ల తర్వాత ఐపిఎల్‌ లో అర్థశతకం నమోదు చేశాడు. అయితే ఈ ఓవర్‌ లో రన్‌ తీసే క్రమంలో కరుణ్‌ నాయర్‌ చూసుకోకుండా బుమ్రాను ఢీకొట్టాడు. వెంటనే క్షమాపణలు కూడా చెప్పాడు. కానీ బౌండరీలు బాదాడనే ఫ్రస్టేషన్‌ లో కరుణ్‌ నాయర్‌ పై బుమ్రా ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో ఆగ్రహానికి లోనైన కరుణ్‌ నాయర్‌ ధీటుగా బదులివ్వడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అంపైర్‌ జోక్యం చేసుకుని బుమ్రాకు సర్ధి చెప్పాడు. కరుణ్‌ నాయర్‌ తన తప్పులేదని హార్థిక్‌ పాండ్యాకు వివరణ ఇచ్చాడు. ఈ గొడవ మధ్యలో రోహిత్‌ శర్మ ఇచ్చిన ఫన్నీ రియాక్షన్స్‌ వేడెక్కిన వాతావరణాన్ని మార్చి నవ్వులు పూయించాయి. ”మ్యాచ్‌ అయిపోయిన తర్వాత.. బయటకు రా చూసుకుందాం” అని రోహిత్‌ అన్నట్లుగా ఉందని సోషల్‌ మీడియాలో కామెంట్లు నవ్వులు పూయిస్తున్నాయి.

➡️