పారిస్ : రెజ్లర్ వినేశ్ ఫోగాట్ అప్పీల్ పై తీర్పును ఆగస్ట్ 13న వెల్లడించనున్నట్లు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సిఎఎస్) ఆదివారం ప్రకటించింది. వినేశ్ అప్పీల్ చర్చించేందుకు మరికొంత సమయం పడుతుందని, ఆగస్ట్ 13న తమ నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు సిఎఎస్ అడహక్ డివిజన్ పేర్కొంది. 100 గ్రాముల అదనపు బరువు కారణంగా వినేశ్‌ను ఫైనల్‌కు అనర్హురాలిగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఆదివారం తీర్పు వెలువడుతుందని భారత ఒలింపిక్ సంఘం శనివారం సాయంత్రం తెలిపింది. మొదట శనివారం సాయంత్రం తీర్పు వెల్లడిస్తామని ప్రకటించిన కోర్టు చివరి క్షణంలో వాయిదా వేసింది. ఒలింపిక్స్ ముగిసేలోపు తీర్పు ప్రకటిస్తామని పేర్కొంది.
ఈ గందర గోళ పరిస్థితుల మధ్య.. వినేశ్ పోగాట్ ఙర ఆగస్ట్ యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ అండ్ ది ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ విషయంలో ఆగస్టు 13 సాయంత్రం 6.00 గంటల లోపు ఇవ్వాలని డా. అన్నాబెల్లె బెన్నెట్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆగస్ట్ 11న ప్రస్తావన ఏమిటంటే.. అన్ని పార్టీలకు ఏవైనా అదనపు పత్రాల సమర్పించడానికి ఇచ్చిన సమయం అని పేర్కొన్నారు.
ఆదివారం స్టేడ్ డి ఫ్రాన్స్‌లో జరిగే వేడుకలతో పారిస్ ఒలింపిక్స్ ముగియనున్నాయి.