Vinesh Phogat – స్వదేశానికి చేరుకున్న వినేశ్‌ ఫొగాట్‌ – క్రీడాభిమానుల గ్రాండ్‌ వెల్‌కం

న్యూఢిల్లీ : భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ శనివారం స్వదేశానికి చేరుకున్నారు. ఆమెకు గ్రాండ్‌ వెల్‌కం చెప్పేందుకు క్రీడాభిమానులు భారీ ఎత్తున ఢిల్లీ విమానాశ్రయానికి తరలివచ్చారు. వారిని చూసిన వినేశ్‌ ఫొగాట్‌ తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీటిపర్యంతమయ్యారు. ఆమెను కాంగ్రెస్‌ ఎంపీ దీపిందర్‌ హుడా, రెజర్లు సాక్షిమలిక్‌, బజరంగ్‌ పునియా, తదితరులు ఓదార్చారు. పారిస్‌ ఒలింపిక్స్‌ ఫైనల్‌కు చేరిన వినేశ్‌.. 100 గ్రాములు అదనపు బరువు కారణంగా అనర్హతకు గురైన సంగతి తెలిసిందే. కోర్టు ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ (కాస్‌)లో అప్పీలు చేసినా సానుకూలంగా ఫలితం దక్కలేదు. ఆమె విజ్ఞప్తిని కాస్‌ కొట్టిపడేసింది.

➡️