- సౌతాఫ్రికాపై వెస్టిండీస్ ఓటమి
టీ20 వరల్డ్‌కప్ సూపర్-8 పోరులో వెస్టిండీస్‌పై సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణిత 20 ఓవర్లలో 135 పరుగులు చేసింది. అనంతరం 136 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన సఫారీలు 2 ఓవర్లు ముగిసేసరికి 15 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలోనే వర్షం రావడంతో మ్యాచ్‌ను 17 ఓవర్లకు కుదించారు. అలాగే దక్షిణాఫ్రికా టార్గెట్‌ను 123గా నిర్ణయించారు. ఈ లక్ష్యన్ని 16.1 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి చేదించింది. సౌతాఫ్రికా బ్యాటర్లలో ట్రిస్టన్ స్టబ్స్(29), హెన్రిచ్ క్లాసెన్(22), మార్కో జాన్సెన్(21), ఐడెన్ మార్క్రామ్ (18), మాత్రమే రాణించారు. మిగతా బ్యాటర్లలో రీజా హెండ్రిక్స్(0), క్వింటన్ డి కాక్ (12), డేవిడ్ మిల్లర్(4) కేశవ్ మహరాజ్(2) విఫలమయ్యారు. చివర్లో మార్కో జాన్సెన్(21), కగిసో రబడా(5) నాటౌట్‌గా నిలబడి మ్యాచ్‌ను గెలిపించారు.
ఇవాళ ఉదయం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తబ్రేజ్ షంషి తన స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శించి విండీస్‌ను దెబ్బకొట్టాడు. షంషి 4 ఓవర్లలో 27 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. జన్సెన్, మార్క్రమ్, కేశవ్ మహారాజ్, రబాడ తలో వికెట్ పడగొట్టారు. వెస్టిండీస్ బ్యాటర్లలో రోస్టన్ ఛేజ్ (52), కైల్ మేయర్స్ 35 పరుగులతో రాణించారు. మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేశారు. హౌప్ 0, పూరన్ 1, రోవ్‌మన్ పావెల్ 1, రూథర్‌ఫోర్డ్ 0, రసెల్ 15, అకీల్ హొసేన్ 6 పరుగులకు ఔటయ్యారు. చివర్లో అల్జరీ జోసఫ్ (11), మోటీ (4) నాటౌట్‌గా నిలిచారు. దీంతో వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది.