బంగ్లాదేశ్‌ పై వెస్టిండీస్ ఘన విజయం – సిరీస్ కైవసం

Dec 11,2024 10:53 #Bangladesh, #Cricket, #West Indies

వార్నేర్ పార్క్: వెస్టిండీస్ – బంగ్లాదేశ్‌ మధ్య వన్డే జరిగిన సిరీస్‌ ను వెస్టిండీస్ గెలుచుకుంది. 10 సంవత్సరాల తరువాత మొదటిసారి వెస్టిండీస్ ఈ ఘనత సాధించింది. బంగ్లాదేశ్‌ను 46 ఓవర్లలో 227 పరుగులకు లక్ష్యాన్నివెస్టిండీస్ 37 ఓవర్లలో 230-3 చేధించింది. దీంతో 7వికెట్ల తేడాతో వెస్టిండీస్ విజయం సాధించింది. ఆతిథ్య జట్టు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ బ్యాటర్లు బ్రాండన్ కింగ్, ఎవిన్ లూయిస్ 21 ఓవర్లలో 109 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే జయ్దీన్ సీల్స్ దాటికి బంగ్లాదేశ్ బ్యాటర్లు నిలవలేకపోయారు. మహ్మదుల్లా 92 బంతుల్లో 62 పరుగుల చేసి ఔటయ్యాడు. తంజిద్ హసన్(46), తంజిమ్ హసన్(45) రాణించడంతో 227 పరుగులు చేయగలిగింది. 228 లక్ష్య చేధనతో బరిలోకి దిగిన వెస్టిండీస్  బ్యాటర్లు కింగ్ (82), లూయిస్(49), కార్తీ(45) రాణించడంతో ఘన విజయం సాధించారు. గురువారం (డిసెంబర్ 12) జరిగే చివరి వన్డే కోసం జట్లు బస్సెటెర్రేలో బస చేశాయి.

➡️