జెడ్డా: సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగిన ఐపిఎల్-2025 సీజన్ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రాంచైజీ యాజమాన్యం పక్కా ప్రణాళికతో వ్యవహరించిందని మాజీ క్రికెటర్లు విశ్లేషిస్తున్నారు. వేలం ఉన్న 577మంది ఆటగాళ్లలో హైదరాబాద్ జట్టు తొలి ప్రాధాన్యత క్రమంలోనే మహ్మద్ సిరాజ్, ఇషాన్ కిషన్‌లను కొనుగోలు చేసి తన వ్యూహమేమిటో మిగిలిన ఫ్రాంచైజీలకు తెలిపిందని వారు అభిప్రాయపడుతున్నారు. వీరిద్దరినీ తొలిరోజు వేలంలో కొనుగోలు చేయగా.. రెండోరోజు బ్యాక్ అప్ బెంచ్‌ను పటిష్టం చేసుకొనే దానిపైనే ప్రధానంగా దృష్టి సారించింది. ఎస్‌ఆర్‌హెచ్ జట్టు వేలంకు ముందే పాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, నితీశ్‌రెఓడ్డి, క్లాసెన్, ట్రివస్ హెడ్‌లను అంటిపెట్టుకొని మంచి పని చేసిందని, ఆ తర్వాత రెండ్రోజులపాటు జరిగిన వేలంలో 15మంది ఆటగాళ్లను కొనుగోలు చేసి పక్కా ప్రణాళికతో ఈసారి టైటిల్ వేటకు సిద్ధమౌతుందని వారు వారు అంటున్నారు. ముఖ్యంగా ప్లేయింగ్ ఎలెవెన్‌పైనే సన్‌రైజర్స్ దృష్టి సారించినట్లు తెలుస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు.
2025 వేలంలో సన్‌రైజర్స్ కొనుగోలు చేసిన ఆటగాళ్లు..
1. ఇషాన్ కిషన్ రూ.11.25కోట్లు
2. షమీ రూ.10కోట్లు
3. హర్షల్ పటేల్ రూ.8కోట్లు
4. రాహుల్ చాహర్ రూ.3.20కోట్లు
5. అభినవ్ మనోహర్ రూ.3.20కోట్లు
6. ఆడం జంపా రూ.2.40కోట్లు
7. సిమ్రన్‌జిత్ సింగ్ రూ.1.50కోట్లు
8. ఈషన్ మలింగ రూ.1.20కోట్లు
9. జయదేవ్ ఉనాద్కట్ రూ.1కోటి
10. బ్రైడెన్ కర్సే రూ.1.కోటి
11. కమిందు మెండీస్ రూ.75లక్షలు
12. జీషన్ అన్సారీ రూ.40లక్షలు
13. అథర్వ థైడే రూ.30లక్షలు
14. అంకిత్ వర్మ రూ.30లక్షలు
15. సచిన్ బేబీ రూ.30లక్షలు
బ్యాటర్లు: హెడ్, అభిషేక్ శర్మ, అథర్వ తైడే, అభినవ్ మనోహర్, అంకిత్ వర్మ
వికెట్ కీపర్లు: ఇషాన్ కిషన్, హెన్రిక్ క్లాసెన్
ఆల్‌రౌండర్లు: సచిన్ బేబీ, ఈషన్ మలింగ, అంకిత్ వర్మ, పాట్ కమిన్స్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షల్ పటేల్, కమిందు మెండీస్, బ్రైన్ కర్సే
పేసర్లు: జయదేవ్ ఉనాద్కాట్, సిమ్రన్‌జిత్ సింగ్
స్పిన్నర్లు: రాహుల్ చాహర్, జీషన్ అన్సారి, ఆడం జంపా.
జట్టు అంచనా: హెడ్, అభిషేక్, ఇషాన్, నితీశ్, క్లాసెన్, అభినవ్, సచిన్, కమిన్స్, షమీ, హర్షల్, చాహర్.