ముంబై : న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ మూడో టెస్ట్‌కు దూరమయ్యాడు. విలియమ్సన్ గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని..వచ్చే నెలలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగే టెస్ట్ సిరీస్ దష్ట్యా మూడో టెస్ట్‌కు దూరంగా ఉంచామని కివీస్ మేనేజ్‌మెంట్ తెలిపింది. ప్రస్తుతం విలియమ్సన్ న్యూజిలాండ్‌లోనే రిహాబ్‌లో ఉన్నాడు. అతను మూడో టెస్ట్ కోసం భారత్‌కు రావడం? లేదని కివీస్ మేనేజ్‌మెంట్ స్పష్టం చేసింది.
మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోకి తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన న్యూజిలాండ్ ఇదివరకే సిరీస్‌ను కైవసం చేసుకుంది. చివరిదైన మూడో టెస్ట్ ముంబై వేదికగా నవంబర్ 1న ప్రారంభం కానుంది.