వెలిగిన వింటర్‌ గేమ్స్‌ జ్యోతి

Feb 3,2025 23:25 #A lit Winter, #Games torch, #Sports

షిన్హు (చైనా): 9వ ఆసియా శీతాకాల(వింటర్‌)గేమ్స్‌ చైనాలోని హర్బిన్‌ వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. సోమవారం జరిగిన ప్రారంభోత్సవాల జ్యోతి(టార్చ్‌) రిలే హర్బిన్‌లోని బరోక్‌ బ్లాక్‌లో ప్రారంభమై మొత్తం 11 కిలోమీటర్లు పయనించి సాంగ్హువా నది వద్ద గల వెట్‌ల్యాంట్‌ పార్క్‌లోని ప్రసిద్ధ స్నోమాన్‌ స్క్వేర్‌కు చేరుకుంది. జావోలిన్‌ పార్క్‌, సెంట్రల్‌ స్ట్రీట్‌లను దాటి వచ్చింది. టార్చ్‌ను తొలుత చైనా మాజీ మహిళా స్కేటర్‌ షెన్‌ జు అందుకొని రిలేలో పాల్గొన్నారు. మొత్తం 120మంది టార్చ్‌ బేరర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టార్చ్‌ చైనాలో నగరాలన్నీ తిరిగి సాయంత్రం హర్బిన్‌కు చేరుకుంది. మంగళవారం జరిగే మిక్స్‌డ్‌ డబుల్స్‌ కర్లింగ్‌ రౌండ్‌ రాబిన్‌ లీగ్‌లో ఆతిథ్య చైనా జట్టు బరిలోకి దిగనుంది. తొలి బంగారు పతకాన్ని 8వ తేదీ ఉదయం ప్రదానం చేయనున్నారు. వింటర్‌ గేమ్స్‌ చరిత్రలో 1,270మంది అథ్లెట్లు పాల్గొనడం ఇదే తొలిసారి. భారత్‌నుంచి మొత్తం 76మంది వింటర్‌ గేమ్స్‌లో ప్రాతినిధ్యం వహిస్తుండగా.. ఇందులో పురుషుల విభాగంలో 54మంది, మహిళల విభాగంలో 22మంది పతకాలకు పోటీపడనున్నారు. అప్లినే స్కేటింగ్‌, క్రాస్‌ కంట్రీ, ఫిగర్‌ స్కేటింగ్‌, ఐస్‌ హాకీ, షార్ట్‌ ట్రాక్‌ స్పీడ్‌ స్కేటింగ్‌, స్కీ మౌంటేనిరంగ్‌, స్నో బోటింగ్‌, స్పీడ్‌ స్కేటింగ్‌ విభాగాల్లో భారత అథ్లెట్లు పతకాల రేసులో ఉన్నారు. 9వ ఆసియా వింటర్‌ గేమ్స్‌ ఫిబ్రవరి 7 నుంచి 14వరకు జరగనున్నాయి.

➡️