బెంగళూరు: ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపిఎల్) సీజన్-2025 వేలం ముగిసింది. ఇక మహిళల ప్రిమియర్ లీగ్(డబ్ల్యుపిఎల్) మినీ వేలం జరగనుంది. డిసెంబర్ 15న బెంగళూరు వేదికగా ఈ వేలం జరగనుంది. మొత్తం రూ.15కోట్లతో తమ జట్లలో ఖాళీలను భర్తీ చేసుకోనున్నాయి. ఆ ఫ్రాంచైజీ రూ.4.40కోట్ల నగదును ఖర్చు చేయాల్సి ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్, స్మృతి మంధాన సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రూ.3.25కోట్లు, రెండుసార్లు రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ రూ.2.50 కోట్ల నగదును కలిగి ఉన్నా యి. ప్రతి ఫ్రాంచైజీ 18నుంచి 20మంది ఆటగా ళ్లను తప్పనిసరిగా కొనుగోలు చేసుకోవాల్సి ఉంది.