- కీలక మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై ఓటమి
షార్జా: ఐసిసి మహిళల టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన కీలక మ్యాచ్‌లో భారత్ 9 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 152 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 142 పరుగులకు పరిమితమైంది. హర్మన్ ప్రీత్ కౌర్ (54) ఒంటరి పోరాటం చేసినప్పటికీ గెలిపించలేకపోయింది. దీప్తి శర్మ (29), షఫాలీ వర్మ (20) రాణించారు. ప్రస్తుతం టీమిండియా ఖాతాలో 4 పాయింట్లు ఉన్నాయి. నేటి మ్యాచ్‌లో పాక్‌పై న్యూజిలాండ్ గెలిస్తే ఆ జట్టు సెమీస్‌కు చేరుకుంటుంది. ఓడితే రన్‌రేట్ ఆధారంగా భారత్‌కు సెమీస్ అవకాశాలు ఉంటాయి.ఆస్ట్రేలియాలో గ్రేస్ హారిస్ 40 పరుగులు, తహ్లియా మెక్‌గ్రాత్ మరియు ఎల్లీస్ పెర్రీలు ఒక్కొక్కరు 32 పరుగులు చేశారు.