- నేడు దక్షిణాఫ్రికాతో టైటిల్ పోరు
- మధ్యాహ్నం 12.00గం||ల నుంచి
కౌలాలంపూర్: ఐసిసి మహిళల అండర్-19 టి20 ప్రపంచకప్ ఫైనల్లో భారతజట్టు దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ టోర్నీ ప్రారంభం నుండి సంచలన విజయాలతో ఫైనల్లోకి దూసుకొచ్చిన టీమిండియా.. అదే జోరును ఫైనల్లోనూ చూపితే వరుసగా రెండోసారి ఈ టైటిల్‌ను చేజిక్కించుకోంది. ఇంగ్లండ్‌తో శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో భారత్ ఘన విజయం సాధించగా.. మరో సెమీస్‌లో దక్షిణాఫ్రికా జట్టు ఆసీస్‌ను చిత్తుచేసి ఫైనల్‌కు చేరింది. సెమీస్‌లో వైష్ణవి(3/23), సిసోడియా(3/21) రాణించడంతో ఇంగ్లండ్‌ను 113పరుగులకే కట్టడి చేసి ఆ లక్ష్యాన్ని భారత్ మరో ఐదు ఓవర్లు మిగిలి ఉండగానే వికెట్ కోల్పోయి ఛేదించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన లక్ష్యాన్ని సనిక(18), కమలిని(16) రాణించి మరో ఐదు ఓవర్లు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను ముగించారు. లీగ్‌లో మలేషియాపై 10వికెట్ల తేడాతో, శ్రీలంకపై 60 పరుగుల తేడాతో, బంగ్లాదేశ్‌పై 8వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సూపర్‌సిక్స్‌లో భాగంగా స్కాట్లాండ్‌ను ఏకంగా 150పరుగుల తేడాతో, సెమీస్‌లో ఇంగ్లండ్‌పై 9వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్‌కు చేరింది.
జట్లు..
భారత్(అండర్-19) మహిళలు: నికి ప్రసాద్(కెప్టెన్), కమలిని(వికెట్ కీపర్), త్రిషా, సనికా, ఈశ్వరి, మిథిలా, ఆయుషీ, జోషితా, షబ్నమ్, సిసోడియా, వైష్ణవి, భవికా, ధృతి, ఆనందిత, సోనమ్.
దక్షిణాఫ్రికా (అండర్-19) మహిళలు: కైలా రెనెకె(కెప్టెన్), జెమ్మా బోథా, సిమోనే లారెన్స్, కౌలింగ్, కరబో మెసో(వికెట్ కీపర్), మిక్కీ వాన్, షేష్నీ, లుయాందా, వ్యార్క్, మోనాలిసా, నిహబెసింగ్, డిరా రామ్‌లకమ్, రెన్స్‌బర్గ్, చానెల్ వెంటెర్, ఫిలాండర్.