సింగపూర్: భారత స్టార్ గ్రాండ్ మాస్టర్ డి. గుకేశ్, డిఫెండింగ్ ఛాంపియన్, చైనాకు చెందిన డింగ్ లిరెన్‌ల మధ్య జరిగిన రెండో గేమ్ డ్రా అయ్యింది. ఫిడే ప్రపంచ ఛెస్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌కోసం వీరిద్దరి మధ్య టైటిల్ పోరు జరుగుతోంది. సోమవారం జరిగిన తొలిరౌండ్‌లో డి. గుకేశ్ తెల్లపావులతో బరిలోకి దిగి ఓటమిపాలయ్యాడు. మంగళవారం జరిగిన రెండోరౌండ్‌లో నల్లపావులతో ఆడిన గుకేశ్ ప్రపంచ ఛాంపియన్ డింగ్ లిరెన్‌ను సమర్ధవంతంగా నిలువరించాడు. డింగ్ ఇ4తో ప్రారంభించగా.. గుకేశ్ ఇ5తో సమాధానమిచ్చాడు. వీరిద్దరూ సుమారు 23ఎత్తుల తర్వాత డ్రాకు అంగీకరించారు. దీంతో ఇరువురికి అరపాయింట్ చొప్పున లభించింది. రెండోరౌండ్ ముగిసేసరికి డింగ్ 1.5పాయింట్లు, డి. గుకేశ్ 0.5పాయింట్‌తో ఉన్నాడు. బుధవారం జరిగే మూడోరౌండ్‌లో గుకేశ్ తెల్లపావులతో బరిలోకి దిగాల్సి ఉంది.