మోహిత్‌ శర్మ పేరిట ఐపీఎల్‌ చరిత్రలో చెత్త రికార్డు

Apr 25,2024 07:55 #Cricket, #ipl 2024, #Sports

ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా బుధవారం రాత్రి గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. గుజరాత్‌ టైటాన్స్‌ బౌలర్‌ మోహిత్‌ శర్మ పేరిట అవాంఛిత రికార్డు నమోదయ్యింది. ఐపీఎల్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా మోహిత్‌ పేరిట చెత్త రికార్డు నమోదయింది. మొత్తం 4 ఓవర్లు వేసిన మోహిత్‌ ఏకంగా 73 పరుగులు సమర్పించుకున్నాడు. ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. 2018 ఎడిషన్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుపై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బౌలర్‌ బాసిల్‌ థంపి 4 ఓవర్లు వేసి 70 పరుగులు చెత్త రికార్డును మోహిత్‌ శర్మ పేరిట బద్దలు కొట్టాడు.

ఐపీఎల్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్లు..
1. మోహిత్‌ శర్మ – 0/73 (గుజరాత్‌ వర్సెస్‌ ఢిల్లీ) 2024
2. బాసిల్‌ థంపి – 0/70 (హైదరాబాద్‌ వర్సెస్‌ బెంగళూరు) 2018
3. యష్‌ దయాల్‌ – 0/69 (గుజరాత్‌ వర్సెస్‌ కోల్‌కతా) 2023
4. రీస్‌ టాప్లీ – 0/68 (బెంగళూరు వర్సెస్‌ హైదరాబాద్‌) 2024
5. అర్ష్‌దీప్‌ సింగ్‌ – 0/66 – (పంజాబ్‌ వర్సెస్‌ ముంబై) 2023.

➡️