గుజరాత్ 201/5
మహిళల ప్రిమియర్ లీగ్
వడోధర: మహిళల ప్రిమియర్ లీగ్(డబ్ల్యుపిఎల్)లో గుజరాత్ జెయింట్స్ జట్టు భారీస్కోర్‌ను నమోదు చేసింది. టాస్ నెగ్గిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ స్మృతి మంధాన బౌలింగ్ ఎంచుకోగా.. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ జట్టు 20 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 201పరుగులు చేసింది. ఓపెనర్, వికెట్ కీపర్ మూనీ(56), కెప్టెన్ గార్డినర్(79నాటౌట్) ధనా ధన్ ఇన్నింగ్స్‌తో చెలరేగారు. వోల్వడార్ట్(6), హేమలత(4) నిరాశపరిచినా.. వీరిద్దరూ అర్ధసెంచరీలతో రాణించి జట్టు భారీస్కోర్‌ను దోహదపడ్డారు. మూనీ(56; 42బంతుల్లో 8ఫోర్లు)కి తోడు చివర్లో గార్డినర్(79నాటౌట్; 37బంతుల్లో 3ఫోర్లు, 8సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడింది. బెంగళూరు బౌలర్లు రేణుకా సింగ్‌ను మినహా.. జోహిత, వారేహామ్ బంతులను ఫోర్లు, సిక్సర్లు బాది ముచ్చెమటలు పట్టింది. బెంగళూరు బౌలర్లలో రేణుక(2/25), అహుజ(1/19) మాత్రమే బౌలింగ్‌లో రాణించారు.
స్కోర్‌బోర్డు..
గుజరాత్ జెయింట్స్ మహిళల ఇన్నింగ్స్: మూనీ (సి)మంధాన (బి)ప్రేమా రావత్ 56, వోల్వడార్ట్ (బి)రేణుక సింగ్ 6, హేమలత (సి)ప్రేమ రావత్ (బి)కనిక అహుజ 4, గార్డినర్ (నాటౌట్) 79, డోటిన్ (సి)హోడ్జే (బి)రేణుక సింగ్ 25, సిమ్రన్ షైక్ (బి)వారేహామ్ 11, హర్లిన్ (నాటౌట్) 9, అదనం 11. (20ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 201పరుగులు.
వికెట్ల పతనం: 1/35, 2/41, 3/85, 4/152, 5/182
బౌలింగ్: రేణుక సింగ్ 4-0-25-2, కిమ్ గ్రాత్ 4-034-0, జోషిత 4-0-43-0, కనిక అహుజ 3-0-19-1, వారేహామ్ 3-0-50-1, ప్రేమ రావత్ 2-0-26-1.