WPL : మహిళల క్రికెట్‌ చరిత్రలో రికార్డు-సూపర్‌ ఫాస్ట్‌ బౌలింగ్‌..!

WPL :  మహిళల క్రికెట్‌ చరిత్రలో దక్షిణాఫ్రికా బౌలర్‌ షబ్నిమ్‌ ఇస్మాయిల్‌ రికార్డు సృష్టించారు. మహిళల ప్రీమియర్‌ లీగ్‌ లో గంటకు 132.1 కి.మీల అత్యంత వేగంతో బంతిని విసిరారు. 130 కి.మీలకి మించిన వేగంతో బౌలింగ్‌ చేయడం మహిళా క్రికెట్‌లో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ముంబయి ఇండియన్స్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న షబ్నిమ్‌ మార్చి 5వ తేదీన అరుణ్‌ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్‌ సాధించి రికార్డుకెక్కారు..! మ్యాచ్‌ అనంతరం రికార్డు గురించి ఆమెను ప్రశ్నించగా … తాను రికార్డులు పట్టించుకోనని, బౌలింగ్‌ చేసే సమయంలో పెద్ద స్క్రీన్‌ వైపు చూడనని తెలిపారు.మహిళా క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన బౌలర్‌గా ప్రశంసలు అందుకున్న షబ్నిమ్‌… 2016లో వెస్టిండీస్‌పై 128 కి.మీలు, 2022 మహిళల ప్రపంచకప్‌లో 127 కి.మీల వేగంతో బౌలింగ్‌ చేసి రికార్డు నెలకొల్పారు. గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన షబ్నిమ్‌ దక్షిణాఫ్రికా తరఫున 8 టీ20 ప్రపంచ కప్పుల్లో ఆడారు. 16 ఏళ్ల కెరీర్‌లో 317 అంతర్జాతీయ వికెట్లను పడగొట్టారు.

➡️