- టాప్ 10లో చోటు కోల్పోయిన రోహిత్, కోహ్లీ
అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) ప్రకటించిన తాజా టెస్ట్ బ్యాటర్ల జాబితాలో టాప్10లో ఇద్దరు భారత ఆటగాళ్లుచోటు దక్కించుకున్నారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (811పాయింంట్లు) 4వ స్థానంలో ఉండగా.. రిషబ్ పంత్(724) 9వ స్థానంలో ఉన్నాడు. ఆ తరువాతి స్థానాల్లో శుభ్‌మన్ గిల్(672) 17వ స్థానంలో నిలువగా.. భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల ర్యాంకులు పడిపోయాయి. పింక్ బాల్ టెస్ట్‌కు ముందు 14వ స్థానంలో ఉన్న కోహ్లి 20వ స్థానానికి, రోహిత్ శర్మ తొమ్మిది స్థానాలు పడిపోయి 31వ స్థానంలో ఉన్నారు. పెర్త్ టెస్ట్‌లో అద్భుతమైన బౌలింగ్‌తో రాణించి.. అడిలైడ్ టెస్ట్‌లో నాలుగు వికెట్లు తీసి సత్తా చాటిన బుమ్రా ఐసీసీ బౌలర్ ర్యాంకింగ్స్‌లో నెంబర్ 1 స్థానంలో కొనసాగుతున్నాడు. టాప్ 5 బౌలర్స్‌లలో భారత స్పిన్ బౌలర్ అశ్విన్‌ను వెనక్కి నెట్టి ప్యాట్ కమ్మిన్స్ 4వ స్థానానికి చేరుకున్నాడు. కమ్మిన్స్ పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్‌లో 5 వికెట్లు తీయడంతో ర్యాంకు మెరుగుపర్చుకున్నాడు. బౌలర్ల జాబితాలో బుమ్రా(890) అగ్రస్థానంలో ఉండగా.. అశ్విన్(797), జడేజా(786) 5, 6 స్థానాలో ఉన్నారు.
టాప్‌లో బ్రూక్స్
న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌లో రాణించిన ఇంగ్లండ్ బ్యాటర్ హారీ బ్రూక్స్ ఐసిసి టెస్ట్ బ్యాటర్ల జాబితాలో అగ్రస్థానానికి ఎగబాకాడు. న్యూజిలాండ్‌పై బ్రూక్స్ 123, 55, 323 పరుగులతో రాణించగా.. ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న రూట్ కేవలం 106పరుగులతో మాత్రమే రాణించాడు. దీంతో బ్రూక్స్.. రూట్‌ను వెనక్కి నెట్టి టాప్‌లోకి ఎగబాకాడు