ఐసీసీ ర్యాంకుల్లో 15వ స్థానానికి చేరిన యశస్వి

Feb 21,2024 16:18 #Cricket, #icc rankings, #Sports

భారత యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ ఐసీసీ ర్యాంకుల్లోనూ దూసుకొచ్చాడు. తాజాగా ప్రకటించిన ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో యశస్వి (699 పాయింట్లు) ఏకంగా 14 ర్యాంకులు ముందుకొచ్చి బ్యాటింగ్‌ విభాగంలో 15వ స్థానానికి చేరాడు. బ్యాటింగ్‌ జాబితాలో విరాట్ కోహ్లీ (752) ఒక్కడే టాప్‌-10లో కొనసాగుతుండగా.. దక్షిణాఫ్రికాపై వరుసగా సెంచరీలు చేసిన న్యూజిలాండ్‌ ఆటగాడు కేన్‌ విలియమ్సన్‌ (893) అగ్రస్థానంలో ఉన్నాడు. రాజ్‌కోట్‌ టెస్టులో సెంచరీతో మెరిసిన రవీంద్ర జడేజా బ్యాటింగ్‌ ర్యాంకుల్లో ఏడు స్థానాలను మెరుగుపర్చుకుని 34వ ర్యాంక్‌కు చేరాడు. బౌలింగ్‌ విభాగంలోనూ మూడు స్థానాలు ముందుకొచ్చి ఆరో ర్యాంక్‌ సాధించాడు. ఈ జాబితాలో భారత్‌ స్టార్‌బౌలర్లు జస్‌ప్రీత్ బుమ్రా (876), రవిచంద్రన్ అశ్విన్ (839) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఆల్‌రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా (469)దే అగ్రస్థానం. రెండో ర్యాంకులో అశ్విన్ (330), నాలుగో స్థానంలో అక్షర్ పటేల్ (281) ఉన్నారు.

➡️