ముంబయి: టీమిండియా క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ ప్రమాదంలో అతని మెడకు తీవ్ర గాయమైంది. ఇరానీ కప్ మ్యాచ్ కోసం కాన్పూర్ నుంచి లక్నోకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో అతని తండ్రి నౌషాద్ ఖాన్ కూడా అతనితోనే ఉన్నాడు. ముషీర్ ఇటీవల దులీప్ ట్రోఫీలో ఇండియా-సి జట్టు తరపున ఆడి 181 పరుగుల వ్యక్తిగత స్కోర్‌తో మెరిసాడు. అక్టోబర్ 11నుంచి జరిగే రంజీ సీజన్‌కు కూడా అతను దూరమయ్యే అవకాశాలున్నాయి.