- మూడో వన్డేలోనూ జింబాబ్వేపై గెలుపు
బులవాయో: జింబాబ్వేతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ను పాకిస్తాన్ జట్టు 3-0తో చేజిక్కించుకొని క్లీన్‌స్వీప్ చేసింది. గురువారం జరిగిన మూడో, చివరి వన్డేలో పాక్ జట్టు 99 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తుచేసింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 303పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. కమన్ ఘుమం(103) సెంచరీకి తోడు షఫీక్(50) అర్ధసెంచరీతో రాణించారు. జింబాబ్వే బౌలర్లు సికిందర్ రాజా, నవారుకు రెండేసి, ముజరబ్బాని, ఫరాజ్‌కు ఒక్కో వికెట్ దక్కాయి. అనంతరం పాకిస్తాన్ బౌలర్లు ఆయుబ్, అహ్మద్, రవూఫ్, జమాల్ రెండేసి వికెట్లతో రాణించి జింబాబ్వేను 204 పరుగులకే ఆలౌట్ చేశారు. జింబాబ్వే కెప్టెన్ ఎర్విన్(51) మాత్రమే అర్ధసెంచరీతో రాణించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కమ్రన్ గులామ్‌కు, సిరీస్ సైమ్ ఆయుబ్‌కు దక్కాయి. ఇరుజట్ల మధ్య మూడు టి20ల సిరీస్ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది.