
ఈ మధ్యకాలంలో సింగర్స్ శ్రావణభార్గవి, హేమచంద్రలు విడాకులు తీసుకున్నారంటూ సోషల్మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో సింగర్స్ ఇద్దరూ స్పందించారు.'నా పాటల కంటే కూడా అనవసరమైన రూమర్లు ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నాయి అని జనాలు కూడా వాటిని పిచ్చిగా నమ్మి సమయం వృథా చేసుకుంటున్నారంటూ హేమచంద్ర సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. అటు శ్రావణ భార్గవి సైతం స్పందిస్తూ.. 'కొన్ని రోజులుగా నా యూట్యూబ్ ఛానల్లోని వీడియోలకు వ్యూస్ పెరుగుతున్నాయి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు కూడా పెరిగారు. నాకు పని పెరిగింది, దానితో పాటు ఆదాయం కూడా పెరిగింది. తప్పో ఒప్పో మీడియా వల్లే ఇదంతా జరిగింది' అని రాసుకొచ్చింది. కాగా శ్రావణ భార్గవి, హేమచంద్ర ప్రేమించి, పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. 2013లో వివాహ బంధంతో ఒక్కటైన వీరికి కుమార్తె శిఖర చంద్రిక జన్మించింది.