
మహేష్ బాబు హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతున్న ఎస్‌ఎస్‌ఎంబి-28 చిత్రం నుండి చిత్రబృందం తాజాగా ఒక పోస్టర్ విడుదల చేసింది. ఫ్యామిలీ యాక్షన్‌తో కూడిన మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో శ్రీలీల, పూజా హెగ్డే హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. హారికా హాసినీ క్రియేషన్స్ సంస్థపై ఎస్ రాధాకృష్ణ భారీ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీకి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్ స్ట్రైక్ గ్లింప్స్‌ని మే 31న కృష్ణ గారి జయంతి సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. వాటిని థియేటర్లలో ఫ్యాన్స్ విడుదల చేస్తారని కూడా తెలిపారు. అయితే తాజాగా ఈ మూవీ నుండి మహేష్ పోస్టర్‌ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ మూవీ మాస్ స్ట్రైక్ మరొక రెండు రోజుల్లో విడుదల కానుందని ఆ పోస్టర్‌లో ప్రకటించారు. ఈ చిత్రం 2024 జనవరి 13న ప్రేక్షకుల ముందుకి రానుంది.