Feb 06,2023 14:56

ప్రజాశక్తి-కర్నూల్ స్పోర్ట్స్ : ఈ నెల 10 నుంచి 13 వరకు కృష్ణ జిల్లా హనుమాన్ జంక్షన్ లో జరిగే స్త్రీ పురుషుల విభాగంలో జరిగే 41వ రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీలలో జిల్లా క్రీడాకరులు పాల్గొని విజేతలుగా నిలవాలని కర్నూలు జిల్లా ఒలంపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి యం.అవినాష్ శెట్టి అన్నారు. సోమవారం జిల్లా షూటింగ్ బల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అవుట్డోర్ స్టేడియంలో  షూటింగ్ బాల్ ఎంపిక పోటీలకు ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకొని ఎంపిక పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ క్రీడాకారులు అంకితభావంతో సాధన చేసి రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా షూటింగ్ బాల్ సంఘం కార్యదర్శి బి.ఈశ్వర్ నాయుడు, జాయింట్ సెక్రటరీ నరేష్ కుమార్, కోశాధికారి నాగరాజ,  వ్యాయామ ఉపాధ్యాయులు లక్ష్మీదేవి దితరులు పాల్గొన్నారు.