Jan 24,2023 15:54

న్యూఢిల్లీ   :   నేపాల్‌లో మంగళవారం మధ్యాహ్నం స్వల్ప భూకంపం సంభవించింది.   భూకంప తీవ్రత రిక్టర్‌స్కేలుపై 5.4గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఉత్తరాఖండ్‌లోని పెతోర్‌గఢ్‌కు తూర్పున 148 కి.మీ దూరంలో నేపాల్‌లో 10మీ.లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ అధికారులు తెలిపారు. ఢిల్లీ, ఎన్‌సిఆర్‌ సహా రాజస్తాన్‌లలోని పలు ప్రాంతాల్లో స్వల్ప ప్రకంపనలు వచ్చినట్లు పేర్కొన్నారు. అయితే ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి వుందని అన్నారు. ప్రకంపనల తీవ్రతకు ఇంట్లోని వస్తువులు కదిలిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరలయ్యాయి. ఢిల్లీలో భూమి కంపించడం ఈ నెలలో ఇది మూడోసారి కావడం గమనార్హం.