Sep 29,2022 13:35

ప్రజాశక్తి-భవానిపురం : విజయవాడ గొల్లపూడిలో వన్ సెంటర్ సాయి శేషు టవర్స్ పై ఐదవ అంతస్తు నుండి తల్లి కూతుళ్లు కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. కందుల మాధవి, బొప్పన సత్యవతి సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. సమాచారం అందుకున్న భవానిపురం సీఐ ఉమర్ సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.