Jul 03,2022 11:32

ప్రజాశక్తి -జగ్గయ్యపేట : జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు వద్ద చెరువులో దూకి మంగళగిరి మండలం నవులూరు కి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి శ్వేత(22) ఆత్మహత్యకు పాల్పడింది. మూడు నెలల క్రితం వర్క్‌ ఫర్‌ హోమ్‌ నిర్వహిస్తూ, ఆదివారం హైదరాబాద్‌లో optam కంపెనీలో ఉద్యోగంలో చేరావలసి వుంది. నిన్న సాయంత్రం మంగళగిరిలో ఐదు గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన శ్వేత 8 గంటల సమయంలో తల్లికి ఆత్మహత్య చేసుకున్నట్లు వాట్సప్‌లో వాయిస్‌ మెసేజ్‌ పంపి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో జగ్గయ్యపేట మండలం చిల్లపల్లి చెరువులో శ్వేత మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.