మంగళవారం, 14 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

కొత్త విషయాలు నేర్చుకోవటం అంటే ఇష్టం…

14 జూన్, 2026

grandmaa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 14, 2026, 12:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఈ సంవత్సరం ఎండలు బాగా ఉన్నాయి. దాంతో సెలవుల్లో నెలన్నర రోజులు ఇంట్లోనే ఉన్నాము. ప్రతిరోజూ సాయంత్రం సమయంలో బయటకు వచ్చి, నా స్నేహితురాళ్లతో కలిసి ఆటలు ఆడాను. ఉదయం, సాయంత్రం పూట ఆటలు ఆడటం వల్ల ఎంతో సంతోషంగా ఈ సెలవు రోజులు గడిపాం. అమ్మమ్మ, నాయనమ్మ వాళ్ల ఇళ్లకు వెళ్లి, అక్కడ పల్లెటూరు వాతావరణాన్ని చక్కగా ఎంజాయ్‌ ‌చేశాము. ఇక్కడ ఫ్రెండ్స్ తోపాటు ఊర్లో కూడా కొంతమంది స్నేహితురాళ్లు అయ్యారు. ‘ఖాళీ సమయం ఎలా గడుస్తుంది రా బాబూ’ అనుకునే సమయంలో ఈ ఏడాది వేసవి సెలవులు బాగా సద్వినియోగం చేసుకున్నాను. ఎంతసేపు ఫోన్, టీవీలకు అతుక్కునే బదులు సరదాగా ఆడుకోవటం, తెలియని విషయాలు తెలుసుకోవటం, కొత్త ఆటలు నేర్చుకోవటానికి అవకాశం లభించింది. సబ్జెక్టు అంశాల్లో కొన్ని తెలియని అంశాలు కూడా తల్లిదండ్రుల ద్వారా తెలుసుకోగలిగాను. అంతేకాదు.. ఈ సెలవుల్లో కర్నాటక వెళ్లాం. మన రాష్ట్రం, ఆ రాష్ట్రంలో ఉన్న భౌతిక, వాతావరణ పరిస్థితులు తేడా బాగా తెలిశాయి. కుటుంబసభ్యులతో చక్కగా సెలవులను హ్యాపీగా గడిపాను. త్వరలో ప్రారంభమయ్యే విద్యాసంవత్సరం కోసం ఎదురుచూస్తున్నాను. మొత్తంగా వేసవికాలంలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నా.

mokshasree

యడవల్లి మోక్షశ్రీ,
9వ తరగతి, శ్రీచైతన్య స్కూలు,
పటమటలంక, విజయవాడ.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్