ఆదివారం, 19 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionనన్ను నరికావు

05 జులై, 2026

nannu narikavu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 05, 2026, 08:45 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

నీకు అది చెట్టు

నాకు కాలం చేసిన గాయం

నా కొమ్మలు నేలకూలాయి

కానీ నా అంతరంలో

ఇంకా జీవం మిగిలే ఉంది

రాత్రంతా

చంద్రుడు నా గాయాలపై

వెన్నెల పరిచాడు

ఉదయాన్నే

ఎవరికీ వినిపించకుండా

ఒక చిగురు నవ్వింది -

కొమ్మలు నరికేయవచ్చు

చిగురించే శక్తిని కాదు

గాయాలు చేయవచ్చు

బతకాలనే సంకల్పాన్ని కాదు

అందుకే నేను

మళ్ళీ పచ్చబడుతున్నాను

నిన్ను ఓడించడానికి కాదు

జీవితాన్ని గెలిపించడానికి

మండాది గోపీనాథ్

9885045344

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్