Nov 24,2022 10:56

చెన్నై :   ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు  కమల్‌హాసన్‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతో పాటు శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. దీంతో బుధవారం సాయంత్రం చెన్నైలోని శ్రీ రామచంద్ర మెడికల్‌ సెంటర్‌లో చేరారు. అత్యవసరమైనపరీక్షలు చేసినట్లు వైద్యులు  తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ఒకటి రెండు రోజుల్లో  డిశ్చార్జ్ చేయనున్నట్లు వైద్యులు తెలిపారు.  కొన్నిరోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని  సూచించినట్లు సమాచారం. బుధవారం ఉదయం కమల్ హాసన్ హైదరాబాద్ లోని  ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్‌ను కలిసిన సంగతి తెలిసిందే.