Oct 13,2021 20:11

విభిన్న కథలతో అభిమానులను అలరిస్తున్న హీరో నాని మరో ఆసక్తికరమైన కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఇటీవల 'టక్‌ జగదీష్‌' తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న నాని ఇప్పుడు తన తర్వాత సినిమా తీసేందుకు సిద్ధమయ్యాడు. దసరా కానుకగా తన 29వ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనను చేస్తానని ట్విట్టర్‌ ద్వారా ఓ పోస్టర్‌ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో గూడ్స్‌ రైలు పొగలు కక్కుతూ వెళ్తున్నట్టు కన్పిస్తోంది. సినిమా టీం వివరాలను దసరాకు వెల్లడించనున్నారు. అయితే ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ నిర్మిస్తుంది. ప్రస్తుతం 'శ్యామ్‌ సింగ రారు' షూటింగ్‌ పూర్తి చేసి, 'అంటే సుందరానికి' షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.