
ప్రజాశక్తి-భీమవరం టౌన్ : అసమర్థత పాలనతో జగన్ ప్రభుత్వం నడుస్తుందని, కేసులు పెట్టడంపై ఉన్న దృష్టి అభివృద్ధిపై పెట్టాలని జనసేన జిల్లా అధ్యక్షులు కోటికలపూడి గోవిందరావు (చినబాబు) విమర్శించారు. స్థానిక తాడేరు రోడ్డులో ఉన్న వంతెనను వెంటనే నిర్మాణం చేపట్టాలని వంతేనను పూల మాలలతో అలంకరించి శనివారం వంతెన వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా చినబాబు మాట్లాడుతూ రెండేళ్ళ అయిన ఈ వంతెన నిర్మాణం చేపట్టక పోవడం సిగ్గు చేటని అన్నారు. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఈ పనులలో జాప్యం చేస్తున్నారని, టెండర్లు పిలిచి పనులు పూర్తి చేయాలని, ఆయన అసమర్థత వల్లే అభివృద్ధి పనులు అగిపోతున్నాయని అన్నారు. పరిసర ప్రాంతంలో రైతులు, ఆక్వా సంబంధిత రైతులు ఈ వంతెన లేకపోవటం ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అవుతుందని ఆర్థికంగా చాలా భారంగా మారిందని అన్నారు. రిపేర్ చేసి తాత్కాలికంగా వేసిన వంతెన ఎ క్షణం కులుతుందో తెలియని పరిస్థితి ఈ వంతెన పై రోజు స్కూల్ ,కాలేజ్ విద్యార్థులు రోజూ ఆ వంతెన మీదే ప్రయాణం చేస్తున్నారన్నారు.మీరు చేయకుంటే జనసేన పార్టీ ముందుకు వచ్చి పనులు పూర్తి చేయడానికి సిద్దంగా ఉన్నామని అన్నారు. 30 వేల మందికి ప్రధాన రహదారి అయిన తాడేరు వంతెనను నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ముందుగావన్ టౌన్ సీఐ నిరసన కి పర్మిషన్ లేదని వెంటనే వెళ్లిపోవాలని అనటంతో పోలీసులతో కొంచెం సేపు వాగ్విధం చోటుచేసుకుంది. కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు చెన్నమల్ల చంద్రశేఖర్, బండి రమేష్ కుమార్, కనకరాజు సూరి, వానపల్లి సూరిబాబు, సుంకర రవి, ఉండవల్లి శ్రీను, మండల అధ్యక్షులు మోకా శ్రీను, తిరుమల కృష్ణ, బాలాజీ, అరేటి వాసు, తాటపూడి రాంబాబు, గంధం పెదబాబు, పాండు రంగరాజు తదితరులు పాల్గొన్నారు.